నేతాజీ మార్గంలో నేను

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:57 AM

‘ఇది రెండో స్వతంత్ర పోరాటం... గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను’ అంటున్నారు కమల్‌హాసన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఇండియన్‌ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’) చిత్రంలోనిదీ డైలాగ్‌...

నేతాజీ మార్గంలో నేను

‘ఇది రెండో స్వతంత్ర పోరాటం... గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను’ అంటున్నారు కమల్‌హాసన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఇండియన్‌ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’) చిత్రంలోనిదీ డైలాగ్‌. మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. దేశంలో అవినీతిపరులను ఏరి పారేసేందుకు ఈ సారి సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడో అనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను రూపొందించారు. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శంకర్‌ దర్శకుడు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది కొనసాగింపు. జూలై 12న ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ బానర్స్‌పై సుభాస్కరన్‌ నిర్మించారు.

Updated Date - Jun 26 , 2024 | 05:57 AM