హంటర్‌ ఎంట్రీ

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:18 AM

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘ఎన్‌బికె 109’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతినాయకుడి పాత్రను...

హంటర్‌ ఎంట్రీ

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘ఎన్‌బికె 109’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. మంగళవారం ఆయన ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘‘హంటర్‌ ఎంట్రీ ఇచ్చారు. సెట్స్‌ లోకి స్వాగతం బాబీ డియోల్‌. మూవీలో మీ స్ర్కీన్‌ ప్రజన్స్‌ సినీ లవర్స్‌కి, బాలకృష్ణ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకురానుంది’’ అని పేర్కొంది.

Updated Date - Apr 24 , 2024 | 05:18 AM