హాస్యం అలరిస్తోంది

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:26 AM

రామ్‌ కార్తీక్‌, కశ్వి హీరో హీరోయిన్లుగా మనోజ్‌ పల్లేటి దర్శకత్వం వహించిన ‘వీక్షణం’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది...

రామ్‌ కార్తీక్‌, కశ్వి హీరో హీరోయిన్లుగా మనోజ్‌ పల్లేటి దర్శకత్వం వహించిన ‘వీక్షణం’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. మనోజ్‌ పల్లేటి మాట్లాడుతూ ‘‘వీక్షణం’ చిత్రానికి వస్తున్న ఆదరణతో చాలా సంతోషంగా ఉంది. కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. మేం ఊహించిన దానికన్నా పెద్ద విజయాన్ని ప్రేక్షకులు అందించారు’ అని చెప్పారు. రామ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ ‘నా తొలి చిత్రానికి ఇంత మంచి స్పందన దక్కడం ఆనందాన్నిచ్చింది. మా సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు. ప్రేక్షకులకు మా సినిమా నచ్చితే మరో నలుగురికి చెప్పి ప్రోత్సహించండి అని నిర్మాత కోరారు.

Updated Date - Oct 21 , 2024 | 03:26 AM