తగ్గేదేలా!
ABN , Publish Date - Oct 09 , 2024 | 01:06 AM
అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప 2.. ద రూల్’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ..ద రైజ్’ ఘన విజయం సాధించడంతో...
అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప 2.. ద రూల్’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ..ద రైజ్’ ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఈ సినిమా మీదే ఉంది. అందుకే అంచనాలు అందుకొనేందుకు టీమ్ విశేషంగా కృషి చేస్తోంది. ‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేశామని అంటూ కీలకమైన అప్‌డేట్‌ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందనీ, ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా అంతకు తగ్గేదేలే లా ఉందని అంటున్నారు. ఒక పక్క చిత్రీకరణ పూర్తి చేసుకుంటూనే మరో వైపు నిర్మాణానంతర పనులు శరవేగంతో జరుపుతున్నారు. డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.