జాతకం పూర్తి
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:31 AM
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా రూపొందుతున్న ‘సారంగపాణి జాతకం’ షూటింగ్ పార్ట్ పూర్తయింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు...
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా రూపొందుతున్న ‘సారంగపాణి జాతకం’ షూటింగ్ పార్ట్ పూర్తయింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘నాకు ఎప్పటినుంచో పూర్తి వినోదాత్మక సినిమా తీయాలనే కోరిక ఉంది. జంధ్యాలగారితో ఓ కామెడీ ఫిల్మ్ తీయాలనుకున్నాను కానీ కుదరలేదు. ఆ కోరిక ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ సినిమాతో తీరుతోంది. మనిషి భవిష్యత్ అతని చేతి రేఖల్లో ఉంటుందా, లేక అతని చేసే చేతల్లో ఉంటుందా అని ప్రశ్నకు జవాబు ఇచ్చే పూర్తి హాస్య రస చిత్రం ఇది. మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు చేసిన మోహనకృష్ణ వినోదభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఖర్చు పరంగా, టెక్నికల్ పరంగానూ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేస్తున్నాం’ అని చెప్పారు