మలయాళంలో హిట్‌.. ఇప్పుడు తెలుగులో

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:29 AM

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘భ్రమయుగం’ ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాదించింది. చాలా కాలం తర్వాత పూర్తి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో...

మలయాళంలో హిట్‌.. ఇప్పుడు తెలుగులో

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘భ్రమయుగం’ ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాదించింది. చాలా కాలం తర్వాత పూర్తి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తయారైన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అదినేత సూర్యదేవర నాగవంశీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఉన్న వైవిధ్యమైన కథాంశం, మమ్ముట్టి అద్భుత నటన మలయాళ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందాయి. అందుకే అక్కడ ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అలరిస్తుందని నిర్మాత చెబుతున్నారు. అర్జున్‌ అశోకన్‌, సిద్దార్థ్‌ భరతన్‌, అమల్దా లిజ్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ దర్శకుడు.

Updated Date - Feb 20 , 2024 | 05:29 AM