తెలుసుకోవాల్సిన చరిత్ర

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:09 AM

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు విరించి వర్మ. ఆయన రీసెంట్‌గా దర్శకత్వం వహించిన చిత్రం పొలిటికల్‌ డ్రామా ‘జితేందర్‌ రెడి’్డ. 1980 కాలంలో జగిత్యాలలో...

తెలుసుకోవాల్సిన చరిత్ర

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు విరించి వర్మ. ఆయన రీసెంట్‌గా దర్శకత్వం వహించిన చిత్రం పొలిటికల్‌ డ్రామా ‘జితేందర్‌ రెడి’్డ. 1980 కాలంలో జగిత్యాలలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా స్టూడెంట్‌ లీడర్‌ జితేందర్‌రెడ్డి జీవిత కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాకేశ్‌ వర్రె ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించారు. జితేందర్‌రెడ్డి సోదరుడు ముదుగంటి రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రియాసుమన్‌, చత్రపతి శేఖర్‌, సుబ్బరాజు, రవిప్రకాశ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ఈ చిత్రం విడుదలవుతోంది. బుధవారం ‘జితేందర్‌ రెడి’్డ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర జితేందర్‌రెడ్డి జీవితం. నటుడు రాకేశ్‌ ఈ సినిమా తర్వాత జితేందర్‌రెడ్డిగా గుర్తింపు తెచ్చుకుంటారు. అంత అద్భుతంగా ఈ పాత్రలో జీవించారు’’ అని అన్నారు. దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ ‘‘జితేందర్‌రెడ్డి లాంటి పవర్‌ఫుల్‌ వ్యక్తి జీవితాన్ని డైరెక్ట్‌ చేయడం ఎంతో చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్‌ చేశాం’’ అని చెప్పారు. నటుడు రాకేశ్‌ వర్రె మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఫలితంపై నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇందులోని ఎమోషన్స్‌ మీ అందరినీ కట్టిపడేస్తాయి’’ అని అన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 02:09 AM