తెలుగు నిర్మాతల హిందీ చిత్రం

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:46 AM

టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యాయి. ఈ రెండు సంస్థలు కలసి సన్నీడియోల్‌ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి...

తెలుగు నిర్మాతల హిందీ చిత్రం

టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యాయి. ఈ రెండు సంస్థలు కలసి సన్నీడియోల్‌ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, టి.జి విశ్వప్రసాద్‌ నిర్మాతలు. తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని ద ర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్‌గా హిందీలో ఆయనకు ఇది తొలి చిత్రం. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మేకర్స్‌ గురువారం లాంచ్‌ చేశారు. ఈ నెల 22 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సయామీ ఖేర్‌, రెజీనా కసాండ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఎస్‌ థమన్‌, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ.

Updated Date - Jun 21 , 2024 | 12:46 AM