హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:28 AM

అదితి, జాన్సన్‌, హరినాథ్‌ పొలిచెల్రా, సుస్మితా ఛటర్జీ, సత్య ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రం ‘వాట్‌ ది ఫిష్‌’. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో విశాల్‌ బెజవాడ...

హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌

అదితి, జాన్సన్‌, హరినాథ్‌ పొలిచెల్రా, సుస్మితా ఛటర్జీ, సత్య ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రం ‘వాట్‌ ది ఫిష్‌’. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో విశాల్‌ బెజవాడ, విశాల్‌ బెజవాడ నిర్మించారు. ‘ఇదొక యూనిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌, హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌. ఇటీవల విడుదల చేసిన నిహారిక కొణిదెల, వెన్నెల కిశోర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.’ అని దర్శక నిర్మాతలు చెప్పారు. వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:28 AM