హే హలో.. నమస్తే!

ABN , Publish Date - Mar 17 , 2024 | 05:15 AM

తొలిసారిగా పతంగుల పోటీతో వస్తున్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా ఫిల్మ్‌ ‘పతంగ్‌’. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేశ్‌ కొత్తింటి...

హే హలో.. నమస్తే!

తొలిసారిగా పతంగుల పోటీతో వస్తున్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా ఫిల్మ్‌ ‘పతంగ్‌’. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేశ్‌ కొత్తింటి నిర్మిస్తున్నారు, ప్రణీత్‌ ప్రతిపాటి దర్శకుడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోని ‘ హే హలో నమస్తే’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తున్న సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో వంశీ పూజిత్‌ మాట్లాడుతూ ‘అందరం కొత్తవాళ్లం నటించిన సినిమా ఇది. జోస్‌ జిమ్మి స్వరపరిచిన ఈ పాటకు రెస్పాన్స్‌ బాగుంది’ అన్నారు. ఈ సినిమాకు కథే హీరో అని మరో కథానాయకుడు ప్రణవ్‌ కౌశిక్‌ చెప్పారు. గీత రచయిత శ్రీమణి మాట్లాడుతూ ‘అందరం కలసి చేసిన కొత్త ప్రయత్నం ఇది. మా అందరికీ పేరు తెచ్చే సినిమా అవుతుంది’ అని తెలిపారు. తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ సినిమా ఒక మంచి అవకాశం అన్నారు సంగీత దర్శకుడు జోస్‌ జిమ్మి.

Updated Date - Mar 17 , 2024 | 05:15 AM