Rao Ramesh: రావు రమేష్ హీరోగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'.. ఫస్ట్ లుక్ అదిరింది

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:15 PM

రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' . లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

Rao Ramesh: రావు రమేష్ హీరోగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'.. ఫస్ట్ లుక్ అదిరింది
rao ramesh

రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' (Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ (Rao Ramesh) సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

'మారుతి నగర్ సుబ్రమణ్యం'(Maruthi Nagar Subramanyam)లో రావు రమేష్ ఫస్ట్ లుక్ చూస్తే... గళ్ళ చొక్కా, లుంగీలో పక్కా మాసీగా కనిపిస్తున్నారు. ఈసారి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తానని రావు రమేష్ (Rao Ramesh) తెలిపారు.  సాధారణంగా సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించడం కామన్. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' (Maruthi Nagar Subramanyam) టీమ్ కొత్తగా ఆలోచించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేయమని ప్రేక్షకుల్ని కోరింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా క్యూఆర్ స్కానింగ్ ద్వారా లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి.

r ramesh.jpeg

ఫస్ట్ టైమ్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' టీమ్ చేసిన కొత్త ప్రయత్నానికి సూపర్బ్ రెస్పాన్స్ లభించింది.  'మారుతి నగర్ సుబ్రమణ్యం' (Maruthi Nagar Subramanyam) ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ''ఇప్పటి వరకు రావు రమేష్ (Rao Ramesh) చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్ చేస్తారు. వినోదంతో పాటు భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఫస్ట్ లుక్ (First Look) విడుదల తర్వాత ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్ (Rao Ramesh) గారి లుక్ చాలా బావుందని చెబుతున్నారు.


క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేయమని మేం చేసిన విజ్ఞప్తికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. 50 వేల మందికి పైగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు. రావు రమేష్ గారి ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అభిమానం మాకెంతో సంతోషం కలిగిస్తోంది. కుటుంబం అంతా కలిసి చూసేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఉంటుంది'' అని చెప్పారు. రావు రమేష్ (Rao Ramesh) మాట్లాడుతూ.. ''సినిమా చాలా బాగుంటుంది. భలే గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చూపించిన అభిమానానికి సదా కృతజ్ఞుడిని'' అని చెప్పారు.

ramesh rao.jpeg

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్ (Rao Ramesh) 'మారుతి నగర్ సుబ్రమణ్యం' (Maruthi Nagar Subramanyam) సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

Updated Date - Mar 12 , 2024 | 05:15 PM