మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kiran Abbavaram: వైభ‌వంగా.. కిరణ్ అబ్బవరం, రహస్య ఎంగెజ్మెంట్

ABN, Publish Date - Mar 13 , 2024 | 10:23 PM

ఎట్ట‌కేల‌కు మ‌రో టాలీవుడ్‌ న‌టుడు పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వ‌స్తున్న రూమ‌ర్స్‌కు చెక్ పెడుతూ కిరణ్ అబ్బ‌వ‌రం, న‌టి ర‌హ‌స్య ఘోర‌క్ ఓ ఇంటి వారు కాబోతున్నారు. ఈ రోజు (బుధ‌వారం) సాయంత్రం పెద్ద‌ల స‌మ‌క్షంలో ఎంగెజ్మెంట్ చేసుకున్నారు.

kiran abbavaram

ఎట్ట‌కేల‌కు మ‌రో టాలీవుడ్‌ న‌టుడు పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వ‌స్తున్న రూమ‌ర్స్‌కు చెక్ పెడుతూ కిరణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram), న‌టి ర‌హ‌స్య ఘోర‌క్ ఓ ఇంటి వారు కాబోతున్నారు. 2019లో 'రాజావారు రాణిగారు' (Raja Vaaru Rani Gaaru) సినిమాతో తెలుగులో నటుడిగా ఆరంగేట్రం చేసిన కిరణ్ ఇప్పుడు అదే సినిమాలో కథానాయికగా చేసిన రహస్య (Rahasya Ghorak) తో ఈ రోజు (బుధ‌వారం) సాయంత్రం పెద్ద‌ల స‌మ‌క్షంలో ఎంగెజ్మెంట్ చేసుకున్నారు.


అయితే వీరిద్ద‌రి రిలేష‌న్ గురించి ఆ సినిమా విడుదలైన త‌ర్వాత‌ నుంచే నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతున్నాయి. కానీ ఇన్నాళ్లు ఇయ‌న వాటిపై స్పందించ‌లేదు. తాజాగా ఎంటేజ్మెంట్‌తో పాత వార్త‌ల‌న్నింటికీ ఫుల్ స్టాప్‌ పెట్టిన‌ట్లైంది.

ఇక‌ కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'దిల్ రూబా' సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ర‌హ‌స్య మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటోంది. 'రాజావారు రాణిగారు' (Raja Vaaru Rani Gaaru) సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌లేదు.

Updated Date - Mar 13 , 2024 | 10:23 PM