Mercy Killing: ‘మెర్సి కిల్లింగ్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - Mar 19 , 2024 | 09:18 PM

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన సినిమా ‘మెర్సి కిల్లింగ్’. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా మేకర్స్ వదిలారు.

Mercy Killing: ‘మెర్సి కిల్లింగ్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
Mercy Killing First Look Launch

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన సినిమా ‘మెర్సి కిల్లింగ్’ (Mercy Killing). సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రపీ అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను యువ హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. (Mercy Killing First Look Motion Poster)

ఈ సందర్భంగా ఆకాష్ పూరి (Akash Puri) మాట్లాడుతూ.. ‘మెర్సి కిల్లింగ్’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. మోషన్ పోస్టర్‌లో కాన్సెప్ట్ బాగుంది, ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారని తెలిసింది. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీని అంతా సక్సెస్ చేయాలని కోరుతున్నానని అన్నారు.


Mercy.jpg

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ustaad Bhagat Singh: ‘భగత్స్ బ్లేజ్’.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం

********************

*Kaliyugam Pattanamlo: ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదు.. ట్రెండింగ్‌లో ట్రైలర్

******************

*Niharika Konidela: ఆరోజు రాడిస‌న్ బ్లూ ప‌బ్‌లో ఏం జరిగిందంటే..

**************************

Updated Date - Mar 19 , 2024 | 09:19 PM