హృదయానికి హత్తుకునే ట్రూ లవర్‌

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:45 AM

మణికందన్‌, శ్రీ గౌరిప్రియ, కన్నరవి ప్రధాన తారాగ ణంగా తెరకెక్కిన చిత్రం ‘ట్రూ లవర్‌’. నజరేత్‌ పసీలియన్‌, మగేశ్‌ రాజ్‌ పసీలియన్‌, యువరాజ్‌ గణేశన్‌ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమకథగా దర్శకుడు వ్యాస్‌ రాజ్‌ మలిచారు...

హృదయానికి హత్తుకునే ట్రూ లవర్‌

మణికందన్‌, శ్రీ గౌరిప్రియ, కన్నరవి ప్రధాన తారాగ ణంగా తెరకెక్కిన చిత్రం ‘ట్రూ లవర్‌’. నజరేత్‌ పసీలియన్‌, మగేశ్‌ రాజ్‌ పసీలియన్‌, యువరాజ్‌ గణేశన్‌ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమకథగా దర్శకుడు వ్యాస్‌ రాజ్‌ మలిచారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న ‘ట్రూ లవర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర ్వహించింది. హీరో మణికందన్‌ మాట్లాడుతూ ‘యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రం నచ్చుతుంది. తెలుగు నేర్చుకొని నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను’ అన్నారు. మారుతి మాట్లాడుతూ ‘‘ట్రూ లవర్‌’ చూస్తుంటే నేను తీసిన ‘ఈ రోజుల్లో’, ‘బస్టాప్‌’ చిత్రాలు గుర్తుకొచ్చాయి. కథను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరకెక్కించాడు’ అని చెప్పారు. ట్రూ లవర్స్‌ కోసం రెండు రోజులు ముందుగానే ప్రీమియర్‌ షోస్‌ వేస్తున్నామని ఎస్‌కేఎన్‌ తెలిపారు.

Updated Date - Feb 05 , 2024 | 02:45 AM