పడుచు గుండె చప్పుడు

ABN , Publish Date - May 04 , 2024 | 05:59 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌ మేనల్లుడు అశోక్‌ గల్లా నటిస్తున్న రెండో చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ఆధ్మాత్మిక అంశాలు కలిగిన ఈ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం...

పడుచు గుండె చప్పుడు

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌ మేనల్లుడు అశోక్‌ గల్లా నటిస్తున్న రెండో చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ఆధ్మాత్మిక అంశాలు కలిగిన ఈ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘ఏమయిందే’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. సురేశ్‌ గంగుల రాసిన ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. హీరోయిన్‌ పై హీరోకు ఉన్న ప్రేమను, పడుచు గుండె చప్పుడుని చాలా అందంగా, అద్భుతంగా ఈ పాటలో చూపించారు. రసూల్‌ ఎల్లోర్‌ విజువల్స్‌ పాటకు ప్రాణం పోశాయి. నల్లపనేని యామిని సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Updated Date - May 04 , 2024 | 05:59 AM