జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
ABN, Publish Date - Oct 09 , 2024 | 01:01 AM
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద అరెస్టై జైల్లో ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారానికి వాయిదా వేసింది....
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద అరెస్టై జైల్లో ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు లభించిన అవార్డును కమిటీ తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో తమకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో జానీ మాస్టర్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను నార్సింగి పోలీసులు వెనక్కి తీసుకున్నారు. జాతీయ పురస్కార అందుకునేందుకు ఢిల్లీకి వెళ్లేందుకు ఈ నెల 6 నుంచి 9 వరకూ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. అయితే అవార్డును నిలిపివేయడంతో జానీ మాస్టర్ రిమాండ్‌లోనే కొనసాగుతున్నారు.