హీరోగా తెలుగు సినిమా చేస్తా

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:49 AM

తెలుగులోనూ మంచి అభిమానగణాన్ని సొంతం చేసుకున్న తమిళ నటుల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. ఆయన నటించిన 50వ చిత్రం ‘మహరాజా’....

హీరోగా తెలుగు సినిమా చేస్తా

తెలుగులోనూ మంచి అభిమానగణాన్ని సొంతం చేసుకున్న తమిళ నటుల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. ఆయన నటించిన 50వ చిత్రం ‘మహరాజా’. అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, అభిరామి కీలక పాత్రలు పోషించారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో సుధన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను హీరో విజయ్‌ సేతుపతి మీడియాతో పంచుకున్నారు.


‘‘ఒక నటుడిగా 50 చిత్రాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ‘మహరాజా’ సినిమా కథనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నా క్యారెక్టర్‌ సినిమాలో చాలా భాగం వరకూ అండర్‌ ప్లే చేసి.. కీలక సమయంలో ఒక్కసారి వయోలెంట్‌గా మారుతుంది. ఇందులో నాది కుటుంబం కోసం ఎంతకైనా తెగించే పాత్ర. ఇటువంటి బ్యాలెన్సింగ్‌ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఇంతవరకూ చూడలేదు కాబట్టి తెరపై నా నటన.. పాత్ర తీరు కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు సినిమాను అనుకున్న దాని కంటే చాలా బాగా తీశారు. ఎంతో సహజత్వంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగువారికి తప్పకుండా చేరువవుతుంది. అన్నీ చక్కగా కుదిరితే త్వరలోనే స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తా’’ అని చెప్పారు.

Updated Date - Jun 13 , 2024 | 07:21 AM