భలే ఉన్నాడే అనిపిస్తాడు

ABN , Publish Date - May 06 , 2024 | 02:11 AM

రాజ్‌ తరుణ్‌, మనీషా కంద్కూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. సింగీతం శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, కృష్ణ భగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు...

భలే ఉన్నాడే అనిపిస్తాడు

రాజ్‌ తరుణ్‌, మనీషా కంద్కూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. సింగీతం శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, కృష్ణ భగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో ఎన్‌వీ కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రం సమర్పకుడు మారుతి చేతుల మీదుగా టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇది కాన్సెప్ట్‌ ఫిల్మ్‌. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించగల కంటెంట్‌ ఉంది. రాజ్‌తరుణ్‌ ప్రేక్షకులతో ‘భలే ఉన్నాడే’ అనిపిస్తాడు. కిరణ్‌కు కథ నచ్చి నిర్మించేందుకు ముందుకొచ్చారు. సాయి మంచి అభిరుచి ఉన్న దర్శకుడు’ అని ప్రశంసించారు. రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మారుతి గారితో ఓ సినిమా చేద్దామనుకుంటే ఈ సినిమాతో కుదిరింది. శివసాయి దర్శకత్వంలో మరో సినిమా చేయాలనుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది నా మొదటి సినిమా. మారుతి గారి వల్లే నా కల నెరవేరింది’ అని చెప్పారు.

Updated Date - May 06 , 2024 | 02:11 AM