పెళ్లి పుస్తకం అంత హిట్ అవుతుందన్నారు
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:27 AM
‘ప్రతి మనిషి జీవితంలో పుట్టుక, పెళ్లి, మరణం మూడు ప్రధాన ఘట్టాలు. పెళ్లి కుదిర్చేటప్పుడు రెండువైపులా కుటుంబాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని లగ్గం సినిమా ద్వారా చూపించబోతున్నాం’ అని...
‘ప్రతి మనిషి జీవితంలో పుట్టుక, పెళ్లి, మరణం మూడు ప్రధాన ఘట్టాలు. పెళ్లి కుదిర్చేటప్పుడు రెండువైపులా కుటుంబాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని లగ్గం సినిమా ద్వారా చూపించబోతున్నాం’ అని దర్శకుడు రమేశ్ చెప్పాల అన్నారు. సాయిరోనక్, ప్రగ్నా నగ్ర జంటగా నటించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ఈనెల 25న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రమేశ్ చెప్పాల సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో ‘లగ్గం’ అనేదానికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిచుట్టూ ఉన్న భావోద్వేగాలను తెరపైకి తీసుకురావాలనుకున్నాను. ‘లగ్గం’ అనే టైటిల్ చెప్పగానే అందరూ బావుందన్నారు. రాజేంద్ర ప్రసాద్ ‘ఇది ‘పెళ్లి పుస్తకం’ అంత పెద్ద హిట్ అవుతుంద’న్నారు. క్లైమాక్స్ సినిమాకు ప్రత్యేకాకర్షణ. లగ్గం అరిటాకులో విందు భోజనంలా ఉండబోతోంది’ అని చెప్పారు.