మరో సినిమా చేద్దాం అన్నారు

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:53 AM

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌ పతాకంపై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు...

మరో సినిమా చేద్దాం అన్నారు

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌ పతాకంపై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్‌ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ‘‘నిర్మాతగా నా సినిమా జర్నీని ప్రారంభించేందుకు చూస్తున్న సమయంలో దర్శకుడు అనిల్‌ ఈ కథ చెప్పారు. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు చె ప్పారు. ఇందులోని భావోద్వేగాలు అందరినీ కట్టిపడేస్తాయి. ఈ సినిమా కథను నాకంటే ముందే వరలక్ష్మి శరత్‌కుమార్‌ విని ఓకే చేశారని దర్శకుడు చెప్పారు. ఆమె వండర్‌ఫుల్‌ నటి. నిర్మాతలను వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఆమెతో ఈ సినిమాతో మంచి రిలేషన్‌ బిల్డ్‌ అయ్యింది. ‘శబరి’ తర్వాత మరో సినిమా చేద్దాం అని ఆమె అనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది‘‘ అని చెప్పారు.

Updated Date - Apr 21 , 2024 | 04:53 AM