అందరి మన్ననలు అందుకుంటాడు

ABN , Publish Date - May 20 , 2024 | 05:08 AM

పాపులర్‌ కమెడియన్‌ గెటప్‌ శ్రీను లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రాజు యాదవ్‌’. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి సంయుక్తంగా...

అందరి మన్ననలు అందుకుంటాడు

పాపులర్‌ కమెడియన్‌ గెటప్‌ శ్రీను లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రాజు యాదవ్‌’. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నెల 24న ‘రాజుయాదవ్‌’ విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం గెటప్‌ శ్రీను మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారు.

‘‘ఈతరం కామెడీ నటుల్లో నాకు బాగా ఇష్టమైన నటుడు గెటప్‌ శ్రీను. ఈ సినిమా ట్రైలర్‌ చాలా బావుంది. శ్రీనుని చూస్తుంటే నాకు కామెడీ హీరో చలం గుర్తుకువస్తారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే తన నటనతో గెటప్‌ శ్రీను కూడా అందరి మన్ననలు అందుకుంటాడు’’ అని పేర్కొన్నారు.

Updated Date - May 20 , 2024 | 05:08 AM