సమాజానికి ఉపయోగపడే సినిమాలే చేస్తా
ABN , Publish Date - Aug 08 , 2024 | 04:30 AM
దర్శకుడు సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సింబా’. మురళి మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రలు...
దర్శకుడు సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సింబా’. మురళి మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజేందర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ‘సంపత్ నంది సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో ఈ కథ రాసి నా దగ్గరికి వచ్చారు. ప్రకృతి మీద ప్రేమను పెంచేలా.. పర్యావరణ పరిరక్షణపై అవగాహనను కల్పించేలా ఉంటుందీ చిత్రం. జగపతిబాబు, అనసూయ నటన సినిమాకే హైలైట్. ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం కాబట్టి అదే రోజున సినిమాను విడుదల చేస్తున్నాం. ఇకపై నేను చేసే ప్రతీ సినిమాలో ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఉంటాయి’’ అని చెప్పారు.