ఆయనకు 41.. ఆమెకు 28!

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:47 AM

ప్రేమకు వయసుతో పని లేదు. మనసులు కలిస్తే చాలు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు కన్నడ దర్శకుడు తరుణ్‌ కిశోర్‌ సుధీర్‌ (41). బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించి, పెరిగి పెద్దయ్యాక కూడా నటుడిగా కొనసాగిన సుధీర్‌ ఆ తర్వాత ‘చౌక’ చిత్రంతో...

ప్రేమకు వయసుతో పని లేదు. మనసులు కలిస్తే చాలు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు కన్నడ దర్శకుడు తరుణ్‌ కిశోర్‌ సుధీర్‌ (41). బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించి, పెరిగి పెద్దయ్యాక కూడా నటుడిగా కొనసాగిన సుధీర్‌ ఆ తర్వాత ‘చౌక’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రాబర్ట్‌’ (2021), ‘కాటేరా’ (2023) చిత్రాలకు దర్శకత్వం వహించారు తరుణ్‌. ప్రస్తుతం రేణాకా స్వామి హత్య కేసులో అరెస్ట్‌ అయిన దర్శన్‌ ఈ రెండు చిత్రాల్లో హీరో కావడం గమనార్హం. ‘రాబర్ట్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సోనాల్‌ మోంటెరో (28)తో తరుణ్‌ ప్రేమలో పడ్డారు. అయితే ఆ విషయాన్ని రహస్యంగా దాచారు. వీరిద్దరి గురించి రూమర్స్‌ వచ్చినా ఎవరూ బయట పడలేదు. తాజా ఇప్పుడు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టిన తరుణ్‌, సోనాల్‌.. ఆగస్ట్‌ 11న బెంగళూరులో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Updated Date - Jul 23 , 2024 | 05:47 AM