ఆ శత్రువుని వెంటేసుకుని పుడతాడు
ABN , Publish Date - Sep 26 , 2024 | 01:08 AM
‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువుని వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పవాడవుతాడు. ఓడినోడు మధ్యలోనే..’ అనే డైలాగ్‌తో మొదలయ్యే ‘కలి’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ...
‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువుని వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పవాడవుతాడు. ఓడినోడు మధ్యలోనే..’ అనే డైలాగ్‌తో మొదలయ్యే ‘కలి’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. ప్రిన్స్, నరేశ్ అగస్త్య ఇందులో హీరోలుగా నటించారు. శివశేషు దర్శకత్వంలో లీలా గౌతమ్ వర్మ నిర్మించారు. అక్టోబర్ నాలుగున సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అనీ, ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. కష్టాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే శివరామ్ (ప్రిన్స్) ఇంటికి అపరిచిత వ్యక్తి (నరేశ్ అగస్త్య) వస్తాడు. అతను వచ్చాక శివరామ్ జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు ఏమిటన్నవి ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు శివశేషు చెప్పారు.