కోరుకున్నంత వినోదం ఉంటుంది

ABN , Publish Date - Sep 25 , 2024 | 01:17 AM

‘ఈ సినిమా కథ వినగానే వివేక్‌గారు ‘అచ్చ తెలుగు సినిమాలా ఉంది. టైటిల్‌ ఏమనుకుంటున్నారు’ అని అడిగారు ‘శ్వాగ్‌’ అని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు. వంశవృక్షం గురించి అందరికీ తెలిసిందే కదా దాన్ని గురించి సినిమాలో...

‘ఈ సినిమా కథ వినగానే వివేక్‌గారు ‘అచ్చ తెలుగు సినిమాలా ఉంది. టైటిల్‌ ఏమనుకుంటున్నారు’ అని అడిగారు ‘శ్వాగ్‌’ అని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు. వంశవృక్షం గురించి అందరికీ తెలిసిందే కదా దాన్ని గురించి సినిమాలో చెప్పాం’ అన్నారు హసిత్‌ గోలి. శ్రీవిష్ణు హీరోగా ఆయన రూపొందించిన ‘శ్వాగ్‌’ చిత్రం అక్టోబర్‌ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హసిత్‌ సినిమా గురించి వివరిస్తూ ‘ఇందులో డిఫరెంట్‌ జనరేషన్స్‌ టచ్‌ చేశాం ఇది ఒక వంశానికి చెందిన కథ. ప్రతి జనరేషన్‌లో విష్ణు పాత్ర ఉంటుంది. తరతరాలుగా మగ, ఆడ గొడవ అనేది ఎలా మారుతూ వచ్చింది, ఇప్పటికి దాని రిలవెన్స్‌ ఏమిటనే ఆలోచనలో చేసిన కథ ఇది’ అన్నారు. ‘ఈ సినిమాలో పాత్రల పేర్లు రిథమిక్‌గా పెట్టాలని అనుకున్నాం. అందుకే భవభూతి లాంటి పేర్లు పాత్రలకు పెట్టాం. సినిమాలో నాలుగు పాత్రలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ నాలుగు పాత్రలు కలసి ఎలాంటి కథ చెప్పబోతున్నారన్నది ఆసక్తికరం.


చాలా మంచి కథ ఇది. విష్ణు నుంచి కోరుకునే ఫన్‌ ఉంటుంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ ఆశ్చర్యపోయేలా ఉంటుంది. అలాగే రీతూ వర్మ వింధ్యామర వంశీ రాణిగా కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. వంశవృక్ష నిలయం అనే ప్లేస్‌ని క్రియేట్‌ చేసి పెద్ద సెట్‌ వేశాం. అందరం ఒక ఛాలెంజ్‌గా తీసుకుని వర్క్‌ చేశాం. శ్రీవిష్ణు చాలా ఎనర్జిటిక్‌గా పెర్ఫార్మ్‌ చేశారు. నాలుగు పాత్రల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపించాలని ‘భారతీయుడు’ తదితర చిత్రాలకు పని చేసిన రషీద్‌గారు ప్రోస్తస్టిక్స్‌ చేశారు’ అని వివరించారు హసిత్‌.

Updated Date - Sep 25 , 2024 | 01:18 AM