హరుడైన నరుడు

ABN , Publish Date - Nov 05 , 2024 | 06:42 AM

‘గంగమ్మ తల్లిని తెలుగు ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు. ఆ అమ్మవారి కథతో తీసిన చిత్రమే ‘జాతర’’ అని సతీశ్‌ బాబు రాటకొండ అన్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన...

‘గంగమ్మ తల్లిని తెలుగు ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు. ఆ అమ్మవారి కథతో తీసిన చిత్రమే ‘జాతర’’ అని సతీశ్‌ బాబు రాటకొండ అన్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 8న విడుదలవుతోన్న సందర్భంగా సతీశ్‌బాబు మీడియాతో ముచ్చటించారు.

  • వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కిన చిత్రం ‘జాతర’. ఒక మనిషి రాక్షసుడై అమ్మవారిని చెరపడితే మరో నరుడు హరుడై ఆ రాక్షసుణ్ణి ఎలా సంహరించాడు అనేది మా సినిమాలో వినోదాత్మకంగా చూపించబోతున్నాం.

  • హీరో క్యారెక్టర్‌ మూడు డైమెన్షన్స్‌లో ఉంటుంది. అతను ఒక ఫేజ్‌ నుంచి మరో ఫేజ్‌కు వెళ్లేందుకు ప్రేమ అనేది ఒక మీడియంలా ఉంటుంది.

Updated Date - Nov 05 , 2024 | 06:42 AM