హరోం హరకు ప్యాకప్‌

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:56 AM

సుధీర్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హరోం హర’. ‘ది రివోల్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ జి. నాయుడు నిర్మిస్తున్నారు...

హరోం హరకు ప్యాకప్‌

సుధీర్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హరోం హర’. ‘ది రివోల్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ జి. నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయినట్టు మేకర్స్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా సెట్‌లో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసిన వీడియోను చిత్రబృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో 80వ దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘హరోం హర’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్నారు. సునీల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Apr 21 , 2024 | 04:56 AM