కొత్త తేదీన హరోం హర

ABN , Publish Date - May 22 , 2024 | 12:58 AM

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరోం హర’. మరోసారి ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ముందు ప్రకటించిన విధంగా ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదలవ్వాలి...

కొత్త తేదీన హరోం హర

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరోం హర’. మరోసారి ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ముందు ప్రకటించిన విధంగా ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదలవ్వాలి. అయితే మంగళవారం చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. జూన్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో వెనుక అగ్ని జ్వాలలు చెలరేగుతుండగా, భుజంపై తుపాకీతో నడిచొస్తున్న సుధీర్‌బాబు లుక్‌ శక్తిమంతంగా ఉంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకుడు. మాళవిక శర్మ కథానాయిక. సునీల్‌ కీలక పాత్ర పోషించారు. సుమంత్‌ జి. నాయుడు నిర్మాత. సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌. సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథన్‌.

Updated Date - May 22 , 2024 | 12:58 AM