ఎదురుచూపులు ఫలించేలా

ABN , Publish Date - May 15 , 2024 | 12:36 AM

‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌ కోసం పవన్‌ అభిమానులే కాదు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని నిధి అగర్వాల్‌ అన్నారు. ఆకట్టుకునే అందంతో...

ఎదురుచూపులు ఫలించేలా

‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌ కోసం పవన్‌ అభిమానులే కాదు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని నిధి అగర్వాల్‌ అన్నారు. ఆకట్టుకునే అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నారు ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ. కెరీర్‌ ఆరంభంలోనే వరుస అపజయాలు చవిచూసినా తన అందాల ఆరబోతతో అవకాశాలను దక్కించుకుంటున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత వరుసగా సినిమాలు చేసినా, ఓ మంచి విజయం మాత్రం ఈ అమ్మడుకి అందలేదు. అయితే పవన్‌ కల్యాణ్‌ సరసన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ తనకు ఆ లోటు తీరుస్తుందంటున్నారు నిధి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం తన కెరీర్‌కు ఊపు తెస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ సినిమా రిలీజైన తర్వాత మరిన్ని మంచి పాత్ర లు తనను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకం ఉందన్నారు నిధి.

Updated Date - May 15 , 2024 | 12:36 AM