ఆహ్లాదకరంగా శశివదనే..

ABN , Publish Date - Jan 04 , 2024 | 05:52 AM

గోదావరి నేపథ్యంలో సాగే లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా ‘శశివదనే’. ‘పలాస’ఫేం రక్షిత్‌ అట్లూరి,. కోమలి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిమోహన్‌ ఉబ్బర దర్శకుడు...

ఆహ్లాదకరంగా శశివదనే..

గోదావరి నేపథ్యంలో సాగే లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా ‘శశివదనే’. ‘పలాస’ఫేం రక్షిత్‌ అట్లూరి,. కోమలి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిమోహన్‌ ఉబ్బర దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోడల నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని మేకర్స్‌ బుధవారం విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో ఆహ్లాదకరమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందినట్లు టీజర్‌ చెబుతోంది. ఇప్పటివరకూ విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చిందని, ఈ రోజు విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉందని పలువురు అభినందించారని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా, సంగీతం: శరవణన్‌ వాసుదేవన్‌, నేపథ్య సంగీతం: అనుదీప్‌.

Updated Date - Jan 04 , 2024 | 05:53 AM