హనుమాన్‌ విశ్వరూపవిజువల్స్‌ని సవాలుగా తీసుకున్నా..

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:46 AM

‘అసాధారణ విజయాన్ని అందుకున్న ‘హను-మాన్‌’ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడిగా పనిచేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం’ అని విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడు ఉదయకృష్ణ అన్నారు. ఆయన విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ‘హను-మాన్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని...

హనుమాన్‌ విశ్వరూపవిజువల్స్‌ని సవాలుగా తీసుకున్నా..

‘అసాధారణ విజయాన్ని అందుకున్న ‘హను-మాన్‌’ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడిగా పనిచేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం’ అని విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడు ఉదయకృష్ణ అన్నారు. ఆయన విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ‘హను-మాన్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా కథానాయకుడిగా కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా 200కోట్ల మైలరాయిని దాటి, ఇంకా అదే ఊపును కొనసాగిస్తోంది. ఈ సినిమా విజయం సాధించడం పట్ల ఉదయ్‌కృష్ణ ఆనందం వెలిబుచ్చారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ వినియోగించుకోవడంలో ఎస్‌.ఎస్‌.రాజమౌళీ సరసన సగర్వంగా నిలిచేంత ప్రతిభ ప్రశాంత్‌వర్మలో పుష్కలంగా ఉందని ఉదయ్‌కృష్ణ పేర్కొన్నారు. రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన సినిమా ‘హనుమాన్‌’. ఈ చిత్ర విజయం పడిన శ్రమంతా మరిచిపోయేలా చేసిందని ఆయన అన్నారు. ఈ సినిమాకోసం తను ఫేస్‌ చేసిన పెద్ద ఛాలెంజ్‌ పతాక సన్నివేశంలో హనుమంతుని విశ్వరూపమని, దర్శకులు కలలు గనే ఎంత గొప్ప విజువల్‌ అయినా సునాయాసంగా సాకారం చేసే సామర్థ్యం తనకుందని ఉదయ్‌కృష్ణ చెబుతున్నారు.

Updated Date - Jan 24 , 2024 | 12:46 AM