మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Hanu-man : విదేశాల్లోనూ హను-మాన్‌ను విడుదల చేస్తున్నాం

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:47 AM

యువ కథానాయకుడు తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ‘హను-మాన్‌’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా...

Hanu-man : విదేశాల్లోనూ హను-మాన్‌ను విడుదల చేస్తున్నాం

యువ కథానాయకుడు తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ‘హను-మాన్‌’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ ‘50 రోజుల పండగ చూసి చాలా రోజులైంది. అది మా సినిమాకు జరగడం ఆనందంగా ఉంది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రాబోయే చిత్రాలకు ఈ చిత్ర విజయం పునాది వేసింది. విదేశాల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ‘జై హనుమాన్‌’ వర్క్‌ మొదలైంది. ‘హను-మాన్‌’లో చివరి ఐదు నిముషాలు ఎలా అందరికీ నచ్చాయో ‘జై హనుమాన్‌’ కూడా అలాగే ఉండబోతోంది’ అన్నారు. ప్రేక్షకుల వల్లే ఇంత అద్భుత విజయం సాధ్యమైందని హీరో తేజ చెప్పారు. 150 థియేటర్లలో 50 రోజులు ఆడడం సాధారణ విషయం కాదని, అందరూ ఆంకిత భావంతో సని చేయడం వల్లే ఇది సాద్యమైందని నిర్మాత నిరంజన్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Mar 03 , 2024 | 01:47 AM