గుణశేఖర్‌ ‘యుఫోరియా’

ABN , Publish Date - May 29 , 2024 | 06:40 AM

వైవిధ్యమైన చిత్రాలను భారీ స్థాయిలో రూపొందించే దర్శకుడు గుణశేఖర్‌. ‘శాకుంతలమ్‌’ చిత్రం తర్వాత ఆయన రూపొందించే కొత్త చిత్రం వివరాలు మంగళవారం ప్రకటించారు...

గుణశేఖర్‌ ‘యుఫోరియా’

వైవిధ్యమైన చిత్రాలను భారీ స్థాయిలో రూపొందించే దర్శకుడు గుణశేఖర్‌. ‘శాకుంతలమ్‌’ చిత్రం తర్వాత ఆయన రూపొందించే కొత్త చిత్రం వివరాలు మంగళవారం ప్రకటించారు. యూత్‌ఫుల్‌ సోషల్‌ డ్రామాను ‘యుఫోరియా’ పేరుతో ఆయన తెరకెక్కించనున్నారు. నీలిమ గుణ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామనీ, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నీలిమ గుణ చెప్పారు.

Updated Date - May 29 , 2024 | 06:40 AM