పారిస్‌ వీధుల్లో పలకరింపు

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:07 AM

ప్రస్తుతం మెగా ఫ్యామిలీతో కలసి రామ్‌చరణ్‌ పారిస్‌లో ఒలింపిక్స్‌ క్రీడా సంబరాలను ఆస్వాదిసున్నారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో...

ప్రస్తుతం మెగా ఫ్యామిలీతో కలసి రామ్‌చరణ్‌ పారిస్‌లో ఒలింపిక్స్‌ క్రీడా సంబరాలను ఆస్వాదిసున్నారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ పారీస్‌ వీధుల్లో అనుకోకుండా ఒకరికొకరు ఎదురు పడ్డారు. చిరునవ్వుతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. రామ్‌చరణ్‌ పెంపుడు కుక్క పిల్ల ‘రైమ్‌’ తలనిమిరారు సింధు. వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇద్దరూ గేమ్‌ ఛేంజర్‌లే మీ కలయిక అద్భుతం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 04:07 AM