హను-మాన్‌ కంటే పెద్ద విజయం సాధించాలి

ABN , Publish Date - Apr 21 , 2024 | 05:02 AM

ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రానికి అశ్విన్‌రామ్‌ దర్శత్వం వహిస్తున్నారు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు...

హను-మాన్‌ కంటే పెద్ద విజయం సాధించాలి

ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రానికి అశ్విన్‌రామ్‌ దర్శత్వం వహిస్తున్నారు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టైటిల్‌ను, ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌ ‘డార్లింగ్‌’, ఉపశీర్షిక ‘వై దిస్‌ కొలవెరి’. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ‘డార్లింగ్‌’ సినిమా ‘హను-మాన్‌’ కంటే పెద్ద విజయం సాధించాలి’’ అని అన్నారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరినీ అలరిస్తుంది’’ అని చెప్పారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు కావాల్సిన కంప్లీట్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ఈ సినిమా’’ అని చెప్పారు. దర్శకుడు అశ్విన్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కపుల్స్‌కి, లవర్స్‌కి ఖచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది’’ అని చెప్పారు.

Updated Date - Apr 21 , 2024 | 05:02 AM