ఘన విజయం సాధించాలి

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:33 AM

పులివెందుల మహేశ్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘స్కూల్‌ లైఫ్‌’. సావిత్రి కృష్ణ, సుమన్‌, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. నైనీషా, రాహుల్‌ త్రిశూల్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమాను....

పులివెందుల మహేశ్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘స్కూల్‌ లైఫ్‌’. సావిత్రి కృష్ణ, సుమన్‌, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. నైనీషా, రాహుల్‌ త్రిశూల్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టీమ్‌కు నా అభినందనలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలోని అధిక శాతం షూటింగ్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా తెరకెక్కింది. బడ్జెట్‌ సరిపోకపోవడంతో సినిమాకు కావాల్సిన మిగిలిన మొత్తాన్ని నిర్మాతలు ఇచ్చారు. సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అని హీరో, దర్శకుడు పులివెందుల మహేశ్‌ అన్నారు. ‘‘ప్రేక్షకులు మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాల్ని తప్పక ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే’’ అని నిర్మాత రాహుల్‌ త్రిశూల్‌ చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఎన్‌.హరిబాబు, డీఓపీ: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్‌.

Updated Date - Jul 22 , 2024 | 03:33 AM