ఘన విజయం సాధిస్తుంది

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:33 AM

నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు, ఆయేషా ఖాన్‌ హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణీందర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ లివింగ్‌స్టోన్‌ నిర్మిస్తున్నారు...

ఘన విజయం సాధిస్తుంది

నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు, ఆయేషా ఖాన్‌ హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణీందర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ లివింగ్‌స్టోన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ టీజర్‌ను హీరో సాయి దుర్గాతేజ్‌ ఆన్‌లైన్‌లో, విలేఖరుల సమావేశంలో బ్రహ్మాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘‘మా అబ్బాయికి ఇది 3వ సినిమా. టీజర్‌ అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. నిర్మాత లివింగ్‌స్టోన్‌ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌ ఈ కథ చెప్పినప్పుడు ఒక మంచి థ్రిల్‌ కలిగింది. ఇందులో లవ్‌, యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ రెండు రకాల షేడ్స్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. దర్శకుడు మణీంద్రన్‌ మాట్లాడుతూ ‘‘సినిమా అవుట్‌పుట్‌ అదిరిపోయింది. గౌర హరి సంగీతం ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ’’ అని చెప్పారు. హీరో సంజయ్‌ రావు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది’’ అని అన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 06:33 AM