ఘనంగా సైమా అవార్డుల వేడుక

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:52 AM

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2024 వేడుక దుబాయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన పలువురు తారలు సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకలో...

ఘనంగా సైమా అవార్డుల వేడుక

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2024 వేడుక దుబాయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన పలువురు తారలు సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకలో.. తొలి రోజున తెలుగు, కన్నడ చిత్రాలకు సంబంధించి 2023లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నటీనటులకు, చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఫరియా అబ్దుల్లా, నేహా శెట్టి, శాన్వీ తమ ప్రదర్శనతో వేడుకకు విచ్చేసిన వారిని అలరించారు.


2024 సంవత్సరానికి గాను ‘దసరా’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌ ఎంపికయ్యారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. కన్నడ పరిశ్రమ నుంచి ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ ఏ’ చిత్రానికి ఉత్తమ నటుడిగా రక్షిత్‌ శెట్టి.. ఉత్తమ దర్శకుడిగా హేమంత్‌ రావు ఎంపికయ్యారు. ‘టోబీ’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా చైత్ర ఆర్చర్‌ ఎంపికయ్యారు. కన్నడ స్టార్‌ నటుడు దర్శన్‌ నటించిన ‘కాటేరా’ ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది.


విజేతలు వీరే

ఉత్తమ చిత్రం: భగవంత్‌ కేసరి

ఉత్తమ నటుడు : నాని (దసరా)

ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (దసరా)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్నా)

ఉత్తమ దర్శకుడు : శ్రీకాంత్‌ ఓదెల (దసరా)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): ఆనంద్‌ దేవరకొండ (బేబీ)

సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌: సందీప్‌రెడ్డి వంగా

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): సాయి రాజేష్‌ (బేబీ)

ఉత్తమ హాస్యనటుడు: విష్ణు(మ్యాడ్‌)

ఉత్తమ ప్రతినాయకుడు: దునియా విజయ్‌ (వీర సింహారెడ్డి)

ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా (హాయ్‌ నాన్న)

ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్‌ శెట్టి (దసరా)

బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌: శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)

ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్స్‌ : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, విజయేందర్‌ రెడ్డి తీగల (హాయ్‌ నాన్న)

ఎమర్జింగ్‌ యాక్టర్‌: సుమంత్‌ ప్రభాస్‌ (మేమ్‌ ఫేమస్‌)

ఉత్తమ డెబ్యూ నటి: వైష్ణవి చైతన్య (బేబీ)

ఉత్తమ డెబ్యూ నటుడు: సంగీత్‌ శోభన్‌ (మ్యాడ్‌ )

ఉత్తమ సంగీత దర్శకుడు: హేషామ్‌ అబ్దుల్‌ వహాబ్‌ (హాయ్‌ నాన్న)

ఉత్తమ నేపథ్య గాయని: శక్తిశ్రీ గోపాలన్‌ (హాయ్‌ నాన్న )

ఉత్తమ గాయకుడు: రామ్‌ మిరియాల (బలగం)

ఉత్తమ లిరిక్స్‌ రైటర్‌: అనంత శ్రీరామ్‌ (బేబీ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: భువన్‌ గౌడ (సలార్‌)

Updated Date - Sep 16 , 2024 | 05:52 AM