గోవిందాకు బుల్లెట్‌ గాయం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:31 AM

ప్రమాదవశాత్తు తుపాకి పేలిన ఘటనలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గోవిందా గాయపడ్డారు. ఆయన కాలులోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో...

ప్రమాదవశాత్తు తుపాకి పేలిన ఘటనలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గోవిందా గాయపడ్డారు. ఆయన కాలులోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు సర్జరీ చేసి ఆ బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. మంగళవారం ఉదయం ముంబై జుహూలోని గోవిందా నివాసంలో ఈ ఘటన జరిగింది. ఆయన లైసెన్స్‌ రివాల్వర్‌ చేతిలో నుంచి జారి కిందపడి హఠాత్తుగా పేలింది.

Updated Date - Oct 02 , 2024 | 12:31 AM