స్టైలిష్‌ లుక్‌తో గోపీచంద్‌

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:50 AM

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది...

స్టైలిష్‌ లుక్‌తో గోపీచంద్‌

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీక రణ జరుగుతోంది. బుధవారం గోపీచంద్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘విశ్వం’ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ బైక్‌ను నడుపుతున్న గోపీచంద్‌ స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌

Updated Date - Jun 13 , 2024 | 07:22 AM