వెల్‌కమ్‌కు గుడ్‌బై

ABN , Publish Date - May 22 , 2024 | 12:50 AM

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ సినిమాకు ఉన్నట్టుండి గుడ్‌బై చెప్పేశారు. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పటివరకు కేవలం...

వెల్‌కమ్‌కు గుడ్‌బై

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ సినిమాకు ఉన్నట్టుండి గుడ్‌బై చెప్పేశారు. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పటివరకు కేవలం ఒక్క రోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాలోని సంజయ్‌ పాత్రకు యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. కాగా, ‘వెల్‌కమ్‌’ సిరీస్‌లో మూడవ భాగంగా వస్తున్న చిత్రం ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ కామెడీ డ్రామాను అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌కుమార్‌, సునీల్‌ శెట్టి. దిశా పటానీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, లారా దత్తా తదితరులతో కూడిన భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే, ఫిరోజ్‌ ఏ నడియాడ్‌వాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది.

Updated Date - May 22 , 2024 | 12:50 AM