శంకర్‌తో పనిచేయడం అదృష్టం

ABN , Publish Date - Nov 10 , 2024 | 02:12 AM

హీరో రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో జనవరి 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం లక్నోలో...

హీరో రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో జనవరి 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం లక్నోలో మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘ఈ రోజు డైరెక్టర్‌ శంకర్‌ని మిస్‌ అవుతున్నాం. ఆయన మూవీ ఫైనల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఇండియాలో లక్నో చాలా పెద్ద నగరం. ఇక్కడ మనుషుల మనుసులు కూడా చాలా పెద్దవి. మా గత చిత్రాన్ని పెద్ద మనసుతో ఆదరించారు. ఈ రోజు ఇక్కడ టీజర్‌ లాంచ్‌ జరగడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.


నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ‘ శంకర్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. పైగా అది రామ్‌ చరణ్‌తో అవ్వడం మరింత ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఎస్‌జె సూర్య, అంజలి, కియారా అద్వానీ మాట్లాడుతూ సంక్రాతికి వస్తున్న ఈ సినిమాను ఆదరించారించాలని ప్రేక్షకులను కోరారు.

Updated Date - Nov 10 , 2024 | 02:12 AM