కష్టంతోనే అదృష్టం

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:14 AM

మన వంతు కష్ట పడాలి, అప్పుడే అదృష్టం కూడా కలసి వస్తుంది అని నమ్ముతాను అన్నారు రష్మిక మందన్న. సినిమా జయాపజయాలపై తన ఆలోచనా ధోరణి గురించి చెబుతూ ‘టీంలో ప్రతి ఒక్కరూ శ్రమిస్తేనే...

మన వంతు కష్ట పడాలి, అప్పుడే అదృష్టం కూడా కలసి వస్తుంది అని నమ్ముతాను అన్నారు రష్మిక మందన్న. సినిమా జయాపజయాలపై తన ఆలోచనా ధోరణి గురించి చెబుతూ ‘టీంలో ప్రతి ఒక్కరూ శ్రమిస్తేనే మంచి అవుట్‌ పుట్‌ వస్తుంది. అప్పుడే సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. హీరో, హీరోయిన్‌ దర్శకుడు... ఇలా నటీనటులు మొదలుకొని ప్రతి టెక్నీషియన్‌ సినిమా కోసం ముందస్తుగా సన్నద్ధమయ్యేందుకు చాలా కష్టపడతారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత కష్టపడినా కొన్ని సార్లు అపజయం తప్పదు. అలాంటప్పుడు ఇంత కష్టపడినా ఇలా జరిగిందేంటి అని బాధపడకూడదు. కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్లాలి, అప్పుడే విజయాలు మన సొంతమవుతాయి’ అని రష్మిక చెప్పారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ధనుష్‌, నాగార్జున మల్టీస్టారర్‌ ‘కుబేర’లో కథానాయికగా నటిస్తున్నారు.


శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక లుక్‌ను ఈ నెల 5న విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ తెలిపింది. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 03:14 AM