చిత్ర పరిశ్రమకు మంచి రోజులు

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:22 AM

గడ్డుపరిస్థితుల్లో ఉన్న చిత్రపరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌ అన్నారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే...

చిత్ర పరిశ్రమకు మంచి రోజులు

గడ్డుపరిస్థితుల్లో ఉన్న చిత్రపరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌ అన్నారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే ఉన్నతస్థితికి చేరిందన్నారు. గతంలో రాజకీయ హింసలకు గురై దినదినగండంగా ఉండేదని గుర్తుచేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గే్‌షలతో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. ‘కల్కి’ సినిమా సంచలన విజయం సాధించడం శుభపరిణామమన్నారు. కూటమి విజయంవలే సినీ పరిశ్రమ కూడా ‘కల్కి’తో మంచి విజయాన్ని అందుకుందన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలను కలిసి సినీ పరిశ్రమకు ఒకేరకమైన విధివిధానాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు చెప్పారు.


ఏపీలో కూడా సినీ పరిశ్రమ వికసిస్తుందన్నారు. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు పరిశ్రమ అందిపుచ్చుకుందని, రాష్ట్రంలో కూడా తెలుగు సినిమాల షూటింగులు విరివిగా జరుపుకోనున్నాయన్నారు. ఇక్కడ స్టూడియోలు లేకపోయినా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో తాత్కాలిక సెట్లు వేసుకుని షూటింగులు చేసుకోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తిరుపతి (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 28 , 2024 | 04:22 AM