Good bad ugly : సంక్రాంతికి సిద్ధం

ABN , Publish Date - May 20 , 2024 | 05:04 AM

అజిత్‌కుమార్‌ కథానాయకుడిగా రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మైత్రీమూవీస్‌ బేనర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌...

Good bad ugly : సంక్రాంతికి సిద్ధం

అజిత్‌కుమార్‌ కథానాయకుడిగా రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మైత్రీమూవీస్‌ బేనర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం యూనిట్‌ ఈ చిత్రం నుంచి అజిత్‌ పవర్‌ఫుల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో పాటు రిలీజ్‌డేట్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఫస్ట్‌లుక్‌లో మూడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో అజిత్‌ మేకోవర్‌ అదిరిపోయింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం.

Updated Date - May 20 , 2024 | 05:04 AM