ఓపెన్‌హైమర్‌కు గోల్డెన్‌గ్లోబ్‌ పురస్కారాలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:49 AM

హాలీవుడ్‌ చిత్రం ‘ఓపెన్‌ హైమర్‌’ గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డుల్లో మెరిసింది. పలు విభాగాల్లో పురస్కారాలను గెలుచుకొని సత్తా చాటింది. 81వ గోల్డెన్‌ గ్లోబ్‌ వేడుకలు అమెరికాలోని బేవర్లీహిల్స్‌లో సోమవారం ఘనంగా జరిగాయి...

ఓపెన్‌హైమర్‌కు గోల్డెన్‌గ్లోబ్‌ పురస్కారాలు

హాలీవుడ్‌ చిత్రం ‘ఓపెన్‌ హైమర్‌’ గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డుల్లో మెరిసింది. పలు విభాగాల్లో పురస్కారాలను గెలుచుకొని సత్తా చాటింది. 81వ గోల్డెన్‌ గ్లోబ్‌ వేడుకలు అమెరికాలోని బేవర్లీహిల్స్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. ఓపెన్‌హైమర్‌ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌, ఉత్తమనటుడిగా సిలియన్‌ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ అవార్డులు గెలుచుకోగా ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో లుడ్విగ్‌ గోరాన్సన్‌ పురస్కారం అందుకున్నారు. బార్బీ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌, బాక్సాఫీస్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు దక్కాయి.

Updated Date - Jan 09 , 2024 | 03:49 AM