Game Changer: ఆకర్షణీయమైన స్టిల్‌తో మూడో పాట రిలీజ్ అప్డేట్
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:26 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ మూడో పాటకు ముహూర్తం ఫిక్సయింది. తాజాగా మేకర్స్ ఈ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్తో ఓ బ్యూటీఫుల్ పిక్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇంతకీ థర్డ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 10 జనవరి, 2025న మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ అనంతరం సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ థర్డ్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్ని మేకర్స్ వదిలారు.
Also Read- Tollywood: ఈ రెండు నెలలు సందడే సందడి.. సినీ ప్రియులకు పండగే
సాలిడ్ ప్రమోషనల్ స్ట్రాటజీతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి చివరి టచ్ ఇస్తున్నారు, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సినిమాను పిక్చరైజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ‘జరగండి’, ‘రా మచ్చా’ పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు మూడో పాటతో ఆకట్టుకోవడానికి మేకర్స్ రెడీ అయ్యారు. న్యూజిలాండ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై చిత్రీకరించిన మధుర గీతం రూపంలో మూడవ సింగిల్‌ను విడుదల చేయడానికి బృందం సిద్ధంగా ఉంది. ఈ పాటను నవంబర్ 28న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. రామ్ చరణ్, కియారాలను కూల్ లుక్‌లో చూపించే స్టైలిష్ పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సినిమా టైటిల్లోని ట్రెండ్‌లోకి తీసుకొచ్చేసింది.
ఇప్పటికే ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఈ సినిమా ఆవిష్కరించబోతోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్లాండ్ టి.ఎక్స్ 75040 ఈ ముందస్తు వేడుకకి వేదిక కానుండటం విశేషం. చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకి హాజరుకాబోతున్నారు. సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్న క్రమంలో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో ఇంత భారీగా జరగనున్న వేడుక అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను ఎంతగానో పెంచుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.