గ్లాడియేటర్ 2 వస్తోంది
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:15 AM
పురాతన రోమ్ సామ్రాజాన్ని పాలించిన నిరంకుశ చక్రవర్తుల ఆగడాలు, వారిపై లూసియస్ పోరాటం.. కథాంశంగా రూపుదిద్దుకున్న ‘గ్లాడియేటర్’ చిత్రం 2000 సంవత్సరంలో
పురాతన రోమ్ సామ్రాజాన్ని పాలించిన నిరంకుశ చక్రవర్తుల ఆగడాలు, వారిపై లూసియస్ పోరాటం.. కథాంశంగా రూపుదిద్దుకున్న ‘గ్లాడియేటర్’ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘గ్లాడియేటర్ 2’ చిత్రం నవంబర్ 15న ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పెడ్రో పాస్కల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం గ్రిప్పింగ్ యాక్షన్, హై స్టాక్స్ డ్రామాతో ప్రేక్షకుల్ని అలరించనుంది. రిడ్లీ స్కాట్ అద్భుతమైన విజువల్స్‌తో, ఆకట్టుకునే విధంగా ‘గ్లాడియేటర్ 2’ చిత్రాన్ని రూపొందించారు.