సరికొత్త అనుభూతిని ఇస్తుంది
ABN , Publish Date - Nov 06 , 2024 | 03:13 AM
‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ప్రతి పాత్రను తెరపైన సరికొత్త రీతిలో ఆవిష్కరించిన తీరు కట్టిపడేస్తుంది’ అని దర్శకుడు సంజీవ్ మేగోటి...
‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ప్రతి పాత్రను తెరపైన సరికొత్త రీతిలో ఆవిష్కరించిన తీరు కట్టిపడేస్తుంది’ అని దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పారు. ఆయన దర్శకత్వంలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను సంజీవ్ మేగోటి మీడియాకు వివరించారు.
కడప దగ్గర్లోని ఎర్రగుడి నేపథ్యంలో కథ సాగుతుంది. 1974-90 మధ్య ఆ ప్రాంతంలో జరిగిన గుప్త నిధుల తవ్వకాల ఆధారంగా కథ రాసుకున్నాను. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. సీజీ వర్క్‌కు 11 నెలలు పట్టింది. మంచు లక్ష్మి, ఎస్తేర్ నటన సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది.