వినోదంతో గీతాంజలి వస్తోంది

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:53 AM

‘నా తొలి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘గీతాంజలి’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్‌ ఊహకందని స్థాయిలో ఉంటుంది’ అని అంజలి...

వినోదంతో గీతాంజలి వస్తోంది

‘నా తొలి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘గీతాంజలి’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్‌ ఊహకందని స్థాయిలో ఉంటుంది’ అని అంజలి అన్నారు. ఆమె టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. కోన వెంకట్‌ కథ, స్ర్కీన్‌ప్లే అందించారు. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ, సునీల్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం చిత్రబృందం ఈ సినిమాలోని పాత్రల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు భయపెడతాయి. కోన గారు సృష్టించిన కామెడీ ట్రాక్‌, కథను మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘గీతాంజలి’ సీక్వెల్‌కు అవకాశం ఇచ్చిన కోన వెంకట్‌ గారికి ధన్యవాదాలు. అంజలి, శ్రీనివా్‌సరెడ్డి సహకారం మరిచిపోలేను’ అని తెలిపారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా వెళ్లాలనే కోరికతో ‘గీతాంజలి’ తీశాం. సీక్వెల్‌ ప్రేక్షకులు అంచనాలకు మించి ఆస్వాదించేలా ఉంటుంది. సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. నవ్విస్తూ, భయపెడుతూ వినోదం పంచే చిత్రమిదని శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 02:53 AM